Latest Entries »

పవళింపు సేవకును వేళాయె
పదునాల్గు భువనాల పాలించు పావనికి
పవళింపు సేవకును వేళాయె
జోజో..లాలి

చదువులన్నిటినొసగె చిరునవ్వుతోడా
చల్లని వెన్నలను కురిపించినటుల
చీకటుల తొలగించు ఙానజ్యోతుల
వెలుగు పంకజాక్షి కి నేడు
పవళింపు సేవకును వేళాయె
జోజో..లాలి

వినిపించి మొదలు కనిపించె చూడు
వరగంటి శిఖరాన వేదాత్మ తోడు
పిలిచినా తలచినా అభయమ్ము నొసగి
అలసిన కనులకు
పవళింపు సేవకును వేళాయె
జోజో..లాలి

స్వతంత్ర భారత పౌరుడా
స్వాతంత్రము నీ సొమ్మురా
సోదర హక్కుల భంగముచేసి
స్వార్ధాపరుడవు కాకురా
స్వతంత్ర భారత పౌరుడా||

ఎత్తిన జెండా దించకురా
ఎత్థిన తల ఇక వంచకురా
పొత్తుకలిగి జీవించుటకై
భాగస్థుడవై రారా||స్వతంత్ర ||

స్వీయపరిశ్రమ చేయరా
న్యాయపు బ్రతులే హాయిరా
హేయముగా సోమరివై బ్రతికి
సమయము వ్యర్ధము చేయకురా||స్వతంత్ర ||

యంత్రాగారపు పొగగొట్టాలు
అంతరిక్షమునకందాలి
అంతులేని ఉద్యోగాలు
అందరికీ కల్పించాలి

భారతమాత స్వతంత్రమునకు
తలమానికమనిపించాలి ||స్వతంత్ర ||

*** చిన్నప్పుడు నానమ్మ నేర్పిన దేశభక్తి గేయం:)***

శతమానం భవతి

sarasvati+1.jpg
హరివింటి వర్ణాల పయనించు పవనాలకు…
ఆ మోము అధరాల నగవులు భవతి
తొలిమంచు కిరణాల పులకించు హృదయాలకు…
కరుణించు ఆ కన్నుల చూపులు భవతి

అంబితమె నదీతమె దైవితమె సరస్వతి|
సంహితమే సంగీతమె సురస్వరమె సరస్వతి||

కరుణాలవాల, ఒడినడయాడు బాలలకు సుమబాల తవ లీలా గానముభవతి
అలరారు నవ్వుల తడబడు బుడుబుడి అడుగులకూ..వడి నేర్పు నీ వామహస్తము భవతి
బడినీడ సుఙాన చింతితార్ధులకి ఓ శశిముఖి నీ తలపున సద్గురువులు భవతి
నవయవ్వన జవమున శుభకళ్యాణ తరుణమున శ్రీకంఠపు సౌగంధిక వనమాల భవతి

అంబితమె నదీతమె దైవితమె సరస్వతి|
సంహితమే సంగీతమె సురస్వరమె సరస్వతి||

భవసార సంసార బంధములను నడిపించు కళ్యాణి కమనీయ కస్తూరి భవతి
కమలాక్షి నర్చింప జిఙ్నాస కలిగింప తవ స్ఫాటికా మాల భాసము భవతి
వేవేన జన్మాల పుణ్యంబు ఫలియింప శ్రీమాతనర్చించు భావము భవతి
ఏ తల్లి తలువంగ వరజల్లు కురియునో వరగల్లు శారదా దర్శనము భవతి
…పునఃదర్శనం భవతి!

అంబితమె నదీతమె దైవితమె సరస్వతి|
సంహితమే సంగీతమె సురస్వరమె సరస్వతి||

మనసంటి ధ్యానించి ముక్కంటిని
అడుగంటు జ్ఞానమును అడుగంటిని
మరుకంట మాత నిల కలగంటిని
వరగంటి శిఖరాన కనుగొంటిని

బిక్షాటనము చేయ విజ్ఞాన బాండమ్ము నింపమని నీ ముందు నిలుచుంటిని

సాక్షాత్కారమ్మడుగ పడునాల్గు భువనాల మహారాణి మరుగేల, వలదంటిని

కలగంటినో
వరమంటయో
కలవరమో వరబలమో
నీపాదమేనాడు విడనంటిని

ఒక కంట వేదాంగముల గంటిని
మరుకంట వేదాంత సంపత్తిని
నిలునాసికావక్త్ర నిశ్వాసమున …శాస్త్ర గంగాప్రవాహ ప్రభల్ కంటిని

కలగంటినో
వరమంటయో
కలవరమో వరబలమో
నీపాదమేనాడు విడనంటిని

Wargal Enugu Konda
ఎదురంట గజరాజున్ఁ గంటిని
ఎడమంటి పురివిప్పు శిఖి గంటిని
నీకంటి ఆఙ నిను భువనాలు దాటించు …కలహంస కలయాడు కధకంటిని

కలగంటినో
వరమంటయో
కలవరమో వరబలమో
నీపాదమేనాడు విడనంటిని

Saraswati1

హేమచంద్రమదివో
మదినేల నిండె మధువో
మద్వాక్కునేలు గతివో
ఉద్గతికి మూలమతివో

పాప శమనివో శాప దమనివో
పలుకుల నొసగెడు భారతివీవో
విరజాసనవో బింబాననవో
పిలిచిన పలికెడి సౌధామినివో

సింగపుకొండపై బంగరుతల్లివో
దయగల రాణివో వర్గల్ వాణివో

శ్వేతాంబరమును ధరియించునది
శాంతసహనములు తెలుపుటకో
పుస్తక హస్తము నిత్యము చూపుట
మస్తక నేత్రము తెరియుటకో

రక్షణ నీవో చక్షువు నీవో
సత్యమసత్య విచక్షణ నీవో

హంసవాహినిగ ప్రభవించినవో
తిమిరధ్వంసక కిరణమువో
చిదచిత్ ఙానము ప్రసరించుటకె
శంభునిగిరిపైకేగితివో

ధాతకు దాతవొ, ధాత్రికి ధాతువో
మంత్రము తంత్రము ప్రాణము నీవో

Sri Ramanjaneya Yuddham (1975) – Saketha Sarwabhouma Lyrics

రామా..
తగునా..
నీ దాసుపైన రణభేరివేయ..
సాకేత సార్వభౌమ.. సాకేత సార్వభౌమా..

శరణు శరణయా జానకి రామ
కరుణజూపవా మారుతిపై
సాకేత సార్వభౌమ.. సాకేత సార్వభౌమా..

కలనయినా నిను కొలిచే నేను కయ్యానికెటులోడ్తురా
రాచరికానికి హృదయమె లెదా నెయ్యనికెడమీయదా
ప్రేమనిధానా న్యాయమిదేనా
ప్రేమనిధానా న్యాయమిదేనా
ఇంకేల ఈ శొధనా
సాకేత సార్వభౌమ.. సాకేత సార్వభౌమా..

భక్తుల బ్రోచే వరదుడవీవె భారము నీదెనయా
ఏమరినావ చెసిన సేవ నా మొరనాలింపవా

దాసుని దోసము దండముతో సరి
దాసుని దోసము దండముతో సరి
దండనమేలనయ
సాకేత సార్వభౌమ.. సాకేత సార్వభౌమా..

శరణు శరణయా జానకి రామ
కరుణజూపవా మారుతిపై
సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమా..

రామా..

తెలుగు బ్లాగరులందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు!! స్వామి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను!

Don’t whisper a word. The whole world will be able to hear you. Wankhede is stunned into silence. Rampaul spoils the party, Sammy holds the catch at second slip. Rampaul goes on a celebratory run. Short, not too wide, bounces rib-high, Tendulkar wants to punch, but ends up opening the face on it. Sammy takes a sharp catch at second slip. Five Tests ago he had dropped Dravid in the same position for the man to score a match-winning century. Not today. Just a sigh from Tendulkar as he walks back. A slight grimace towards the end of the walk, looks at the crowd, looks at bat. Walks off. he still has 30 more centuries than the next best…